Dasari Harichandana: ఒక ఐఏఎస్ అధికారిణి, ఒక ఐపీఎస్ అధికారిపై కేంద్రానికి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

BRS Leaders Complain to Central Govt About IAS and IPS Officers
  • ఐపీఎస్ డీఎస్ చౌహాన్, ఐఏఎస్ హరిచందన టార్గెట్‌గా కంప్లైంట్
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణ
  • కేంద్రమంత్రి జితేంద్ర ప్రసాద్‌ కు వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం సివిల్ సర్వెంట్ల చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈరోజు ఢిల్లీలో కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

వివరాల్లోకి వెళితే... ఐఏఎస్ అధికారిణి దాసరి హరిచందన, ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. అధికారులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ, అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కె. సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలోని బృందం కేంద్రమంత్రిని కలిసింది. ఈ బృందంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆ ఇద్దరు అధికారులపై ఆల్ ఇండియా సర్వీస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 
Dasari Harichandana
Telangana
IAS officer
IPS officer DS Chauhan
BRS leaders
Central government complaint
political controversy
civil servants
Congress party
Jitendra Prasad

More Telugu News