Ranjith Reddy: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Income Tax Raid at Former MP Ranjith Reddy Residence
  • హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు తదితర చోట్ల సోదాలు
  • సోదాలు చేపడుతున్న 15 బృందాలు
  • కొన్నేళ్లుగా సంస్థ చేసిన చెల్లింపులు, బకాయిలపై ఆరా
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ సంస్థతో లావాదేవీలు జరిపిన కారణంగా ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. సంస్థ సీఈవో సత్యనారాయణ రెడ్డి, ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంతో పాటు నెల్లూరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో మొత్తం 15 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సంస్థ చేసిన చెల్లింపులు, బకాయిలు వంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
Ranjith Reddy
Income Tax Raid
IT Raid
DSR Group
Hyderabad
Telangana
Tax Evasion

More Telugu News