Bay of Bengal Cyclone: తీరం దాటిన వాయుగుండం.. ఉత్తరాంధ్రలో వర్షాలు

North Andhra Braces for Rains as Cyclone Makes Landfall
––
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటింది. విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి సమీపంలో తీరం దాటింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం.. మధ్యాహ్నం తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 35 - 45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Bay of Bengal Cyclone
Odisha Cyclone
Andhra Pradesh Rains
Gopalpur
Cyclone Alert
North Andhra
IMD
Weather Forecast
Heavy Rains

More Telugu News