Volodymyr Zelensky: ట్రంప్ అలా.. జెలెన్ స్కీ ఇలా.. మీటింగ్ ఎలా జరగనుందో!

Trump Zelensky Meeting EU Leaders Express Concerns
  • కీలక భేటీ ముందు నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలు
  • యుద్ధం ముగింపు నమ్మేటట్లు ఉండాలన్న జెలెన్‌స్కీ
  • నాటో సభ్యత్వం, క్రిమియాల గురించి మర్చిపోవాలన్న ట్రంప్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ట్రంప్ భేటీ అయ్యారు. తాజాగా ఈ రోజు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీతో భేటీ కానున్నారు. 

ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రకటనపై యురోపియన్ యూనియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు, ట్రంప్ తో భేటీకి ముందు జెలెన్ స్కీ కూడా కీలక ప్రకటన చేశారు. ఈ రెండు ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో ట్రంప్, జెలెన్ స్కీ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ కు మద్ధతుగా యురోపియన్ యూనియన్ దేశాధినేతలు కూడా పాల్గొంటుండడం విశేషం.

జెలెన్ స్కీ ఏమన్నారంటే..
ట్రంప్ తో భేటీ కోసం వాషింగ్టన్ కు చేరుకున్న జెలెన్ స్కీ.. రష్యాతో యుద్ధాన్ని ప్రపంచం నమ్మేలా ముగించాలని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ను కాపాడుకుంటాననే నమ్మకం తనకు ఉందని, తమ భద్రతకు స్పష్టమైన హామీ ఈ సమావేశంలో పొందుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ప్రారంభించిందే రష్యా.. కాబట్టి యుద్ధాన్ని ఆపేయాల్సింది కూడా అదేనని అన్నారు. యుద్ధం ఆపేయాలన్నది తమ బలమైన ఆకాంక్ష అని, ఉక్రెయిన్ ప్రజలు తమ భూమి కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్‌, ఐరోపా నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ట్రంప్ ఏమన్నారంటే..
యుద్ధం ఆపడమా లేక కొనసాగించడమా అనేది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేతుల్లోనే ఉంది. అయితే, రష్యా చేతుల్లోకి వెళ్లిపోయిన క్రిమియా భూభాగాన్ని తిరిగి పొందాలన్న ఆలోచనతో పాటు నాటోలో చేరాలన్న కోరికను ఉక్రెయిన్ మర్చిపోవాల్సిందే. కొన్ని విషయాలను మార్చలేమని ట్రంప్ ట్రూత్‌ సోషల్ లో పోస్టు చేశారు.
 
భేటీలో పాల్గొంటున్నది వీరే..
బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
ఫిన్లాండ్‌ ప్రధాని అలెగ్జాండర్‌ స్టబ్‌
ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌
నాటో చీఫ్‌ మార్క్‌ రుట్టె
Volodymyr Zelensky
Ukraine
Russia
Donald Trump
Ukraine war
Russia Ukraine war
NATO
Crimea
European Union
Volodymyr Zelensky meeting

More Telugu News