Hans Raj: డ్రమ్ములో భర్త డెడ్ బాడీ.. భార్యాపిల్లలు మిస్సింగ్
- రాజస్థాన్ లోని అల్వార్ లో కలకలం
- మృతుడు ఇటుకల బట్టీలో కార్మికుడు
- యూపీ నుంచి వలస వచ్చి అల్వార్ లో ఉంటున్నట్లు గుర్తింపు
రాజస్థాన్ లోని అల్వార్ లో కలకలం రేగింది.. ఆదర్శనగర్ లోని ఓ ఇంటి డాబాపై డ్రమ్ములో శవం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడిని యూపీకి చెందిన హన్స్ రాజ్ గా గుర్తించామని, అతడి భార్యాపిల్లలు కనిపించడం లేదని తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన హన్స్ రాజ్ దాదాపు నెలన్నర క్రితం అల్వార్ లోని ఆదర్శనగర్ కాలనీలో ఓ వృద్ధురాలి ఇంట్లో అద్దెకు దిగాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కాపురం పెట్టాడు. హన్స్ రాజ్ స్థానిక ఇటుకల బట్టీలో పనిచేసేవాడని ఇంటి యజమాని తెలిపారు. కాగా, కొంతకాలంగా ఇంట్లో ఎవరూ కనిపించడం లేదని చెప్పారు.
ఆదివారం తాను డాబాపైకి వెళ్లగా తీవ్ర దుర్వాసన వచ్చిందని, దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించానని యజమాని వివరించారు. డాబా పైన డ్రమ్ములో నుంచే దుర్వాసన వస్తోందని గుర్తించిన పోలీసులు.. ఆ డ్రమ్మును తెరిచి చూడగా మృతదేహం బయటపడిందన్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. హన్స్ రాజ్ హత్యకు గురయ్యాడని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. అతడి భార్యాపిల్లల కోసం గాలిస్తున్నారు.