స్వదేశానికి చేరుకున్న స్పేస్ హీరో శుభాంశు శుక్లా.. ఢిల్లీలో ఘన స్వాగతం
- స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణన్
- నేడు ప్రధాని మోదీతో సమావేశం కానున్న శుక్లా
ఈ సందర్భంగా శుక్లా విక్టరీ చిహ్నం చూపుతూ అందరికీ అభివాదం చేశారు. తన అనుభవాలను స్నేహితులు, సహచరులతో పంచుకోవడానికి ఆత్రుతతో ఉన్నానని నిన్న ఎక్స్ వేదికగా శుభాంశు శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే. యాక్సియం – 4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గత ఏడాది అమెరికా వెళ్లారు. మిషన్ విజయవంతమైన తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చారు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శుక్లా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొంటారు.