Seattle Robbery: రెప్పపాటులో కోట్లు విలువచేసే నగలు ఎత్తుకెళ్లిన దొంగలు.. వీడియో ఇదిగో!

Seattle Jewelry Store Robbed of Millions in Daring Daylight Heist
––
పట్టపగలే నగల దుకాణంలోకి చొరబడ్డ దొంగలు.. రెప్పపాటులోనే రూ.17 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. అమెరికాలోని సియాటెల్‌ నగరంలో మినాషే అండ్ సన్స్ దుకాణంలో జరిగిన ఈ దోపిడీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నలుగురు ముసుగు దొంగలు కేవలం రెండు నిమిషాల్లోపే 2 మిలియన్‌ డాలర్ల విలువైన నగలను దోచుకెళ్లారు.

దుకాణం ప్రవేశ ద్వారాన్ని బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు.. తుపాకీతో సిబ్బందిని బెదిరించి, ఆరు డిస్ ప్లే కేస్ లలోని వజ్రాల నగలు, ఖరీదైన వాచ్ లను తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్ లలో వేసుకుని పట్టుకెళ్లారు. ఈ ఘరానా దోపిడీ మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దుకాణం యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Seattle Robbery
Minashe and Sons
Seattle jewelry heist
jewelry store robbery
Washington crime
2 million dollar heist
jewelry theft
armed robbery
Seattle crime

More Telugu News