కొత్త పాస్ బుక్కుల ఆవిష్కరణ కార్యక్రమం వాయిదాపై మంత్రి అనగాని వివరణ

  • స్త్రీశక్తి పథకం కారణంగా పాస్ బుక్కుల ఆవిష్కరణ వాయిదా పడిందన్న అనగాని
  • వారం లేదా పది రోజుల్లో కార్యక్రమం ఉంటుందని వెల్లడి
  • జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామన్న మంత్రి
స్త్రీశక్తి పథకం కారణంగా ఈరోజు జరగాల్సిన కొత్త పాస్ బుక్కుల ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వారం లేదా పది రోజుల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పాస్ బుక్కుల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఈ నెల 29, 30 తేదీల్లో మంత్రుల బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాయని... ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి ముఖ్యమంత్రికి సమగ్ర నివేదికను అందిస్తామని వెల్లడించారు. 

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాసిన లేఖ ఆధారంగా విశాఖలో సైనిక ఉద్యోగుల భూములపై విచారణ జరుగుతోందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల నేపథ్యంలో వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ శాఖ పారదర్శకంగా పని చేస్తోందని తెలిపారు.    


More Telugu News