Balakrishna: ప్రజలే దేవుళ్లు... నేను పూజారిని మాత్రమే: బాలకృష్ణ

Balakrishna Says People Are Gods I Am Just A Priest
  • ఎందరో త్యాగఫలితమే మన స్వాతంత్ర్య దినోత్సవమన్న బాలయ్య
  • హిందూపురం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని వ్యాఖ్య
  • తన తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని వెల్లడి
ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన స్వాతంత్ర్య దినోత్సవమని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. వారివల్లే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని చెప్పారు. హిందూపురం నియోజకర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయని... యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తన తండ్రి దివంగత్ ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నానని చెప్పారు. 

ప్రజలే దేవుళ్లు... సమాజమే దేవాలయం... తాను పూజారిని మాత్రమేనని బాలయ్య చెప్పారు.  సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ నాకు మీ ఆశీస్సులే శ్రీరామ రక్ష అని అన్నారు. నాన్నగారి దీవెనల వల్లే మీ అందరి గుండెల్లో ఉన్నానని చెప్పారు.
Balakrishna
Hindupuram
TDP MLA
Independence Day
NTR
Andhra Pradesh Politics
Telugu Desam Party
Political Speech
Development

More Telugu News