Venkatesh: వెంకీ, త్రివిక్ర‌మ్ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం

Venkatesh Trivikram New Project Launched
  • 'ఎక్స్' వేదిక‌గా త‌న కొత్త సినిమాను ప్ర‌క‌టించిన వెంక‌టేశ్‌
  • నేడు పూజా కార్య‌క్రామాలు జ‌రుపుకున్న కొత్త ప్రాజెక్ట్‌
  • వెంకీ నటించిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు త్రివిక్రమ్‌ మాటలు
  • ఇప్పుడు హిట్ కాంబోలో మూవీ సెట్ కావ‌డంతో అభిమానుల హ‌ర్షం
టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని వెంకీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా.. ఈ ప్రాజెక్ట్ ఇవాళ పూజా కార్య‌క్రామాలు జరుపుకుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఇది వెంక‌టేశ్‌కు 77వ సినిమా. త్వ‌ర‌లోనే షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. 

కాగా, వెంకీ నటించిన 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి సూప‌ర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్‌ మాటల ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. ఇప్పుడు ఈ కాంబోలో మూవీ ఖాయం కావ‌డంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన‌ 'సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీతో వెంకటేశ్ భారీ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. దీంతో వెంకీ మామ త‌దుప‌రి సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూశారు. ఇప్పుడు త్రివిక్ర‌మ్‌తో మూవీ చేస్తుండ‌డంతో వారి ఆనందానికి అవ‌ధుల్లేవ్‌. ఈ కాంబో త‌ప్ప‌నిస‌రిగా సూప‌ర్ హిట్ కొడుతుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.   


Venkatesh
Venkatesh Daggubati
Trivikram Srinivas
Harika and Hassine Creations
Telugu cinema
Tollywood
Venkatesh new movie
Trivikram movie
Radha Krishna
Telugu movie news

More Telugu News