విజ‌య‌వాడ‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్క‌రించిన సీఎం చంద్ర‌బాబు

  
విజ‌య‌వాడ న‌గ‌రంలోని మున్సిప‌ల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు జాతీయ‌జెండాను ఎగుర‌వేసి పోలీసుల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎస్ విజ‌యానంద్‌, డీజీపీ హ‌రీశ్ కుమార్ గుప్తా, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

స్టేడియానికి విద్యార్థులు, న‌గ‌ర పౌరులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ముఖ్య‌మంత్రి వాహ‌నంపై నుంచి అంద‌రికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శించిన శ‌క‌టాలు, ప‌రేడ్ ఆక‌ట్టుకున్నాయి. ప‌రేడ్‌లో పాల్గొన్న వివిధ బెటాలియ‌న్ల‌ను సీఎం చంద్ర‌బాబు ప‌రిశీలించారు. 


More Telugu News