Chandrababu Naidu: 79వ స్వాతంత్ర్య దినోత్సవం: ప్రజలకు చంద్రబాబు, పవన్ శుభాకాంక్షలు

Chandrababu and Pawan Kalyan Greetings for 79th Independence Day
  • 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు
  • భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందన్న సీఎం చంద్రబాబు
  • దేశ ఐక్యత కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలన్న డిప్యూటీ సీఎం పవన్
  • దేశ సమగ్రతకు సమైక్యంగా పనిచేద్దామని నేతల పిలుపు
దేశవ్యాప్తంగా రేపు (ఆగస్టు 15) 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర, దేశ ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత, ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ సమైక్యంగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

"దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలలో అన్ని విధాలా బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతున్న తరుణం ఇది. ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి  సమైక్యంగా కృషి చేసేందుకు ఈ సందర్భంగా సంకల్పిద్దాం..." అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 

" 79వ స్వాతంత్ర్య దినోత్సవానికి సన్నద్ధమైన దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశం. మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది అంటే ఆ త్యాగధనుల ఆత్మార్పణల ఫలితమే. దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి. నుదిటి సిందూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించి, వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలున్నాయి. రక్షణ , అంతరిక్ష రంగాల్లో అభేద్యమైన స్థాయికి మన భారతదేశం చేరుతున్నందుకు ప్రతి ఒక్కరం గర్విద్దాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృఢ నాయకత్వంలో రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉంటూ... అంతర్జాతీయంగా మూడో స్థానానికి చేరువయ్యాం. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండటం మన బాధ్యత... జైహింద్!" అంటూ పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Pawan Kalyan
Independence Day India
79th Independence Day
India
Indian Independence Day
August 15
India Independence Day Celebrations
Indian Politics

More Telugu News