B.Tech Ravi: పులివెందులలో రప్పా రప్పా బ్యాచ్ ఏమైంది? జగన్ అహం దించాలని వైసీపీ వాళ్లే నాతో చెప్పారు: బీటెక్ రవి

BTech Ravi YSRCP Leaders Want to Reduce Jagans Arrogance
  • పులివెందులలో ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందన్న బీటెక్ రవి
  • వైసీపీ కార్యర్తలు జగన్ ను బూతులు తిడుతున్నారని వ్యాఖ్య
  • వైసీపీ కార్యకర్తలు మాతో చెప్పిన మాటలు వింటే జగన్ ఆత్మహత్య చేసుకుంటారన్న రవి
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీకి ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఆ పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. రీ పోలింగ్ లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థికే పట్టం కట్టారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు వచ్చాయని... ఇప్పుడు పులివెందులలో 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారని తెలిపారు. 

గత ఐదేళ్లలో పులివెందులలో వైసీపీ కార్యకర్తలను జగన్ విస్మరించారని... వైసీపీ కార్యకర్తలు పులివెందులలో జగన్ ను బూతులు తిడుతున్నారని బీటెక్ రవి చెప్పారు. రీపోలింగ్ అడిగింది అవినాశ్ రెడ్డే అని... రీపోలింగ్ లో కూడా టీడీపీకే ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. జగన్ మాట్లాడితే గంగమ్మ జాతర, రప్పా రప్పా అంటున్నారని... పులివెందులలో రప్పా రప్పా బ్యాచ్ ఏమైందని ఎద్దేవా చేశారు. 

జగన్ ను, అవినాశ్ ను తాను గౌరవించే మాట్లాడతానని... కానీ వారు తన గురించి అసభ్యంగా మాట్లాడతారని విమర్శించారు. జగన్ అహంకారం దించాలని, ఎన్నికల్లో సహకరిస్తామని వైసీపీకి చెందిన చాలా మంది నాయకులు తమకు చెప్పారని వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు తమతో చెప్పిన మాటలు వింటే జగన్ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఐదేళ్లు తమతో పని చేయించుకుని పావలా కూడా ఇవ్వలేదని వైసీపీ వాళ్లు తనతో చెప్పారని... మీకు సహకరిస్తామని వాళ్లు తనతో చెప్పినప్పుడు తాను నమ్మలేదని... కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు వారి మాటలను నమ్ముతున్నానని చెప్పారు. జగన్ పై వైసీపీ కేడర్ కు కసి ఉందని అన్నారు.
B.Tech Ravi
Pulivendula
ZPTC elections
Andhra Pradesh politics
YS Jagan Mohan Reddy
YSRCP
TDP
Avinash Reddy
Pulivendula politics
Andhra Pradesh elections

More Telugu News