ఒంటిమిట్టలో కూడా వైసీపీకి ఘోర పరాభవం... టీడీపీ ఘన విజయం
- వైసీపీ అభ్యర్థిపై టీడీపీ 6,267 ఓట్లతో ఘన విజయం
- టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు
- వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు
కడప జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే పులివెందులలో తిరుగులేని విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీడీపీ... ఒంటిమిట్ట జడ్పీటీసీని కూడా కైవసం చేసుకుంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా... వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిపై 6,267 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వైసీపీ అధినేత జగన్ గడ్డపై రెండు జడ్పీటీసీలను స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం.