Pulivendula: వైఎస్ కంచుకోట పులివెందులలో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

Pulivendula Sees Stunning TDP Win Over YSRCP
  • పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం
  • టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు
  • వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు
ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదయింది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.

పులివెందుల ఉప ఎన్నికలో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. లతారెడ్డికి, హేమంత్ రెడ్డికి హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ, వైసీపీ అభ్యర్థి కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు. జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి.
Pulivendula
Pulivendula election
YS Jagan
TDP
Maredy Latha Reddy
Andhra Pradesh politics
AP politics
B Tech Ravi
YSRCP
ZPTC election

More Telugu News