Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం .. ఏడు గేట్లు ఎత్తి నీరు విడుదల

Srisailam Reservoir receives heavy inflows water released
  • జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,17,221 క్యూసెక్కుల వరద నీరు
  • శ్రీశైలం ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 1,87,208 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల
  • శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సుంకేశుల, జూరాల నుంచి 1,17,221 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది.

ఈ క్రమంలో ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 1,87,208 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 65,632 క్యూసెక్కులను అదనంగా నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నీటి మట్టం నేటి ఉదయానికి 882.10 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వ 199.2737 టీఎంసీలుగా నమోదయింది. 
Srisailam Reservoir
Srisailam dam
Krishna River
Flood discharge
Nagarjuna Sagar
Water release
Hydropower generation
Sunkesula
Jurala

More Telugu News