Rashid Khan: ఇదేం షాట్ బాబోయ్.. రషీద్ కొట్టిన సిక్సర్‌ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

Rashid Khan Hits Unbelievable Six in The Hundred League
  • 'ది హండ్రెడ్' లీగ్‌లో రషీద్ ఖాన్ అద్భుత సిక్సర్
  • సౌథీ బౌలింగ్‌లో ఊహించని షాట్ ఆడిన రషీద్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ప్రపంచ క్రికెట్‌లో తన స్పిన్‌ మాయాజాలంతో ఆకట్టుకునే ఆఫ్ఘనిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్, ఇప్పుడు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. తాజాగా 'ది హండ్రెడ్' లీగ్‌లో అతను కొట్టిన ఓ వినూత్నమైన సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే రషీద్, ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ తనదైన శైలిలో విధ్వంసం సృష్టిస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. 'ది హండ్రెడ్' టోర్నీలో భాగంగా ఓవల్ ఇన్విన్సిబుల్స్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ వేసిన బంతిని ఎదుర్కొన్న రషీద్, బంతి పడకముందే క్రీజులో పక్కకు జరిగాడు. దాంతో సౌథీ యార్క‌ర్‌ వేయగా, దాన్ని రషీద్ తన మణికట్టు మాయాజాలంతో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా ఫ్లాట్‌గా సిక్సర్‌గా మలిచాడు. ఈ అద్భుత షాట్‌కు సంబంధించిన వీడియోను 'ది హండ్రెడ్' తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ షాట్‌ను చూసిన అభిమానులు "నమ్మశక్యం కాని షాట్", "అద్భుతం" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ కేవలం 9 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి తన జట్టు ఓవల్ ఇన్విన్సిబుల్స్ 180 పరుగుల భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు. అయితే, రషీద్ మెరుపులు ఆ జట్టును గెలిపించలేకపోయాయి. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇటీవల కాలంలో రషీద్ ఖాన్ తన ప్రదర్శనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 2023 ప్రపంచకప్ తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న తాను, తొందరపడి మైదానంలోకి అడుగుపెట్టడం పెద్ద తప్పిదమని అతనే స్వయంగా అంగీకరించాడు. ఈ కారణంగానే ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున దారుణంగా విఫలమయ్యానని తెలిపాడు. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఐపీఎల్ తర్వాత రెండు నెలల విరామం తీసుకున్న రషీద్, ఇప్పుడు 'ది హండ్రెడ్' టోర్నీలో ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
Rashid Khan
Rashid Khan batting
The Hundred League
Oval Invincibles
Birmingham Phoenix
Tim Southee
Afghanistan cricket
cricket six
cricket shot
T20 cricket

More Telugu News