Harish Rao: ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ

Harish Rao Writes Letter to Uttam Kumar Reddy on Kaleshwaram Project
  • కాళేశ్వరం ప్రాజెక్టు కింది జలాశయాలను నింపాలని విజ్ఞప్తి
  • రైతుల కోసం ఆరో ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్లు ఆన్ చేయాలన్న మాజీ మంత్రి
  • జలాశయాల్లో నీరు నింపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న జలాశయాలను నింపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ జలాశయాలను నింపాలని కోరారు. రైతుల కోసం ఆరో ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్లు ఆన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జలాశయాల్లో నీరు నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

క్యూలో నిలిచిన రైతులు.. ఆగిన హరీశ్ రావు

హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలోని రాఘవాపూర్‌లో పర్యటించారు. ఎరువుల కోసం రైతులు వరుసలో నిలుచొని ఉండటం చూసి ఆయన ఆగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీపీ, ఒక బస్తా విధానం తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి కృత్రిమ కొరతను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికలు ఉన్నందున ఎరువులను బీహార్‌కు తరలిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు.
Harish Rao
Telangana
Kaleshwaram Project
Irrigation
Reservoirs
Farmers
Fertilizers
Siddipet
BRS
Uttam Kumar Reddy

More Telugu News