బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన బాలకృష్ణ
- అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన
- నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే దారిలో ఆసుపత్రి నిర్మాణం
- తొలి దశలో 500 పడకల సామర్థ్యంలో ఆసుపత్రి నిర్మాణం
నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే ఈ-7 రహదారిని ఆనుకుని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు. మొత్తం 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మూడు దశల్లో ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు. రూ. 750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలను ఏర్పాటుచేస్తారు. రెండో దశలో పడకల స్థాయిని వెయ్యికి పెంచుతారు. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి కానున్నాయి.