సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు థ్యాంక్స్‌: ఎన్టీఆర్

  • ఏపీలో 'వార్‌2' మూవీ టికెట్ల రేట్ల‌ను పెంచిన ప్ర‌భుత్వం
  • ఈ నేప‌థ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్ర‌ఫీ మంత్రికి తార‌క్ థ్యాంక్స్ 
  • ఈ మేర‌కు 'ఎక్స్' వేదిక‌గా ఎన్టీఆర్‌ స్పెష‌ల్‌ పోస్టు
  • రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
వార్‌2 మూవీ టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్ర‌భుత్వం జీఓ ఇవ్వడంపై హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తార‌క్ ధ‌న్య‌వాదాలు తెలుపుతూ పోస్టు పెట్టారు. 

"వార్‌2 విడుద‌ల సంద‌ర్భంగా కొత్త జీఓను ఆమోదించినందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

ఏపీలో 'వార్‌2' టికెట్ రేట్ల పెంపు ఇలా..
సింగిల్ స్క్రీన్ల‌లో రూ. 75 (జీఎస్‌టీతో క‌లిపి), మ‌ల్టీప్లెక్సుల్లో రూ. 100 (జీఎస్‌టీ స‌హా) చొప్పున పెంచుకునేందుకు ఏపీ స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. అలాగే రేపు రిలీజ్ రోజున ఉద‌యం 5 గంట‌ల‌కు స్పెష‌ల్ షోకు టికెట్ల రేట్ల‌ను రూ. 500 (జీఎస్‌టీతో క‌లిపి)గా నిర్ణ‌యించింది. ఇక‌, పెంచిన టికెట్ రేట్లు ఈ నెల 23 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. 


More Telugu News