Hyderabad: రేపటి నుంచి మూడు రోజులు బయటకు రావొద్దు: హైదరాబాద్ ప్రజలకు హైడ్రా హెచ్చరిక

Hyderabad Stay indoors for three days warns HYDRA
  • 13, 14, 15 తేదీల్లో ప్రజలు బయటకు రావొద్దన్న హైడ్రా
  • మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడి
  • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. 13, 14, 15 తేదీల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హైడ్రా నగర ప్రజలను హెచ్చరించింది. ఈ మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

మేడ్చల్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని హైడ్రా వెల్లడించింది. 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Hyderabad
Hyderabad rains
Telangana rains
Heavy rainfall alert
IMD Hyderabad

More Telugu News