Jagadish Reddy: 'కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్రపూజలు' అంటూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు: జగదీశ్ రెడ్డి
- కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై జగదీశ్ రెడ్డి విమర్శలు
- ఇద్దరు మంత్రులు అసమర్థులని వ్యాఖ్య
- గోదావరి నీటిని ఏపీకి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపాటు
తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్రపూజలు అంటూ వీరిద్దరూ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరిద్దరికీ హెలికాప్టర్ల ఆర్భాటాలు, కమీషన్ల దందాలు తప్ప రైతుల పట్ల ప్రేమ లేదని విమర్శించారు.
గోదావరి నీటిని ఏపీకి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ అసమర్థులు కాబట్టే ఇదంతా జరుగుతోందని విమర్శించారు. నల్గొండలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను కోమటిరెడ్డి సొంత కార్యాలయంగా మార్చుకున్నారని మండిపడ్డారు.
నాగార్జున సాగర్ నుంచి వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా వీరు పట్టించుకోవడం లేదని జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎనిమిదేళ్లు చెరువులను నిండుగా ఉంచి, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ మంత్రులు అయ్యాక పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు.