మెరుగైన కంటి చూపు కోసం 'స్పెషల్ టీ'!

  • జామ ఆకుల్లోనూ ఔషధ ప్రయోజనాలు  
  • జామ ఆకులతో టీ 
  • తాజా పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెల్లడి
చాలామంది జామ పండ్లను తింటారు కానీ, దాని ఆకుల్లో ఉన్న ప్రయోజనాల గురించి తక్కువ మందికి తెలుసు. జామ ఆకుల్లో కంటి ఆరోగ్యానికి తోడ్పడే అద్భుతమైన గుణాలు ఉన్నాయని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది. జామ ఆకులతో చేసిన టీ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, కంటి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

కొన్ని జామ ఆకులు, ఒక టీస్పూన్ తేనె, రెండు కప్పుల నీరు.

తయారీ విధానం

మొదట జామ ఆకులను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి, బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత, అందులో శుభ్రం చేసిన జామ ఆకులను వేసి, ఐదు నుంచి పది నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. నీరు గోధుమ రంగులోకి మారిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, ఆ నీటిని వడకట్టాలి. చివరిగా, వడకట్టిన టీలో తేనె కలిపి తాగితే సరిపోతుంది.

ప్రయోజనాలు

జామ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కంటికి అవసరమైన శక్తిని అందించి, కంటి చూపును మెరుగుపరుస్తాయి. అలాగే, కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల కంటి అలసట తగ్గి, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.



More Telugu News