అవినాశ్ ను అరెస్ట్ చేశారని అంటున్నారు... టీడీపీని ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు కదా: డోలా వీరాంజనేయస్వామి
- పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న మంత్రి డోలా
- పులివెందులలో వైసీపీ ఓటమి ఖాయమని వ్యాఖ్య
- వైసీపీ నేతలు ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపాటు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో ఓటర్లకు పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారని... ఎన్నికల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆరోపించారు.
151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని వీరాంజనేయస్వామి విమర్శించారు. పులివెందులలో కూడా వైసీపీకి ఓటమి ఖాయమని... ఈ విషయాన్ని వాళ్లు జీర్ణించుకోలేక టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు అంటున్నారని.. టీడీపీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు కదా? అని ప్రశ్నించారు. వైసీపీ మాదిరి తాము గొడవలు, ధర్నాలు చేయడం లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. వైసీపీ నేతలు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.