Asim Munir: గుజరాత్ లోని రిలయన్స్ రిఫైనరీని టార్గెట్ చేస్తాం: అసిమ్ మునీర్ హెచ్చరిక

Asim Munir threatens Reliance refinery in Gujarat
  • రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంటామన్న పాక్ ఆర్మీ చీఫ్
  • అమెరికా పర్యటనలో జనరల్ అసీమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఇది అణు బెదిరింపేనని తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ
  • ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యాఖ్యలు
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ తన అమెరికా పర్యటనలో భారత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కవ్వింపులకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించారు. ఈ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌గా గుర్తింపు పొందింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక విందు సమావేశంలో, మునీర్ ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిత్రంతో పాటు ఖురాన్ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను ప్రస్తావించారు. అంతేకాదు, భారత్ కు అణు హెచ్చరికలు కూడా చేశారు. అమెరికా నేలపై నుంచి మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ యొక్క యుద్ధోన్మాద వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయని భారత్ అభిప్రాయపడింది. కాగా, మునీర్ న్యూక్లియర్ వార్నింగ్ నేపథ్యంలో... భారత్, పాకిస్థాన్ దేశాల సైనిక, అణు సామర్థ్యంపై చర్చ మొదలైంది. 

సైనిక బలం: భారత్ ఆధిపత్యం

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం, భారత్ సైనిక బలం పాకిస్థాన్ కంటే చాలా ఎక్కువ. భారత్‌లో సుమారు 14 లక్షల మంది సక్రియ సైనిక సిబ్బంది ఉన్నారు, వీరిలో 12.3 లక్షలు ఆర్మీ, 75,500 నౌకాదళం, 1,49,900 వైమానిక దళం, మరియు 13,350 కోస్ట్ గార్డ్‌లో ఉన్నారు. దీనికి విరుద్ధంగా, పాకిస్థాన్‌లో 7 లక్షల కంటే తక్కువ సైనిక సిబ్బంది ఉన్నారు. 5,60,000 మంది ఆర్మీ, 70,000 మంది వైమానిక దళం, మరియు 30,000 మంది నౌకాదళంలో ఉన్నారు. అంతేకాక, భారత్‌లో 25 లక్షల మంది పారామిలటరీ బలగాలు ఉండగా, పాకిస్థాన్‌లో కేవలం 5 లక్షల మంది మాత్రమే ఉన్నారు.

న్యూక్లియర్ సామర్థ్యం: భారత్ ముందంజ

రెండు దేశాలు న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉన్నప్పటికీ, గత 20 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే... భారత్‌లో 180 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉండగా, పాకిస్థాన్‌లో 170 ఉన్నాయని అంచనా. భారత్‌ అగ్ని-5 క్షిపణులు బహుళ లక్ష్యాలను ఒకేసారి ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ (ఎంఐఆర్‌వీ) సాంకేతికతను కలిగి ఉన్నాయి. అగ్ని-5 రేంజ్ 5,000 నుంచి 8,000 కి.మీ. వరకు ఉండగా, పాకిస్థాన్ యొక్క షాహీన్-3 క్షిపణి రేంజ్ 2,750 కి.మీ. మాత్రమే. 

Asim Munir
Reliance refinery
Mukesh Ambani
India Pakistan military comparison
nuclear weapons
Jamnagar refinery
pakistan army chief
agni 5 missile
military strength

More Telugu News