Amar Deep: గోవాలో నేను తాగి పడిపోతే... సుప్రీత నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేసింది: అమర్ దీప్

Amar Deep Reveals Goa Incident with Supreetha
  • సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటేందుకు రెడీ అవుతున్న అమర్ దీప్
  • సుప్రీత, అమర్ దీప్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
  • షూటింగ్ సమయంలో ఇద్దరం బాగా క్లోజ్ అయ్యామన్న అమర్ దీప్
బుల్లితెరపై ప్రేక్షకులను మెప్పించిన నటుల్లో అమర్ దీప్ చౌదరి ఒకరు. బిగ్ బాస్ సీజన్-7లో కూడా ఆయన సందడి చేశారు. సీరియల్స్ నటి తేజశ్విని గౌడని ప్రేమ వివాహం చేసుకున్నారు. సీరియల్స్ ద్వారా పెరిగిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగుతోంది. 

మరోవైపు, సిల్వర్ స్క్రీన్ పై కూడా తనను నిరూపించుకునేందుకు అమర్ దీప్ రెడీ అవుతున్నారు. 'చౌదరి గారి అబ్బాయి... నాయుడు గారి అమ్మాయి' సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సుప్రీతకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. 

ఈ సినిమా షూటింగ్ సమయంలో అమర్ దీప్, సుప్రీతకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమర్ దీప్ మాట్లాడుతూ సుప్రీత గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 

షూటింగ్ సమయంలో తామిద్దరం చాలా క్లోజ్ అయ్యామని... స్క్రిప్ట్ డిస్కషన్స్ కోసం సిట్టింగ్స్ కూడా చేస్తుంటామని అమర్ దీప్ తెలిపారు. ఒకసారి తన ఫ్రెండ్స్ తో తాను, సుప్రీత ఫ్రెండ్స్ తో ఆమె సపరేట్ గా గోవాకు వెళ్లామని చెప్పారు. గోవాలో తాము అనుకోకుండా కలిశామని... ఆ రాత్రి తాను ఫుల్ గా తాగి పడిపోతే... తెల్లారి 9 గంటలకు సుప్రీత తనను తన రూమ్ వద్ద డ్రాప్ చేసిందని తెలిపారు. సుప్రీత తల్లి సురేఖతో కూడా తనకు చనువు ఉందని, ఆమెను తాను అక్క అని పిలుస్తుంటానని చెప్పారు. వాళ్లతో ఉన్న అనుబంధం విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతానని అన్నారు.
Amar Deep
Amar Deep Choudary
Supreetha
Chowdari Gari Abbayi Naidu Gari Ammayi
Telugu Movie
Bigg Boss Telugu
Surekha Vani
Goa
Telugu Cinema
Tejaswini Gowda

More Telugu News