Mithun Chakraborty: బ్రహ్మోస్ క్షిపణులు ఒకదాని వెంట మరొకటి పాకిస్థాన్ పైకి వెళతాయి: మిథున్ చక్రవర్తి వార్నింగ్

Mithun Chakraborty Warns Pakistan of BrahMos Missiles
  • సింధు జలాలను భారత్ అడ్డుకోవడంతో పెద్ద నష్టం జరిగిందన్న బిలావల్ భుట్టో 
  • పాకిస్థాన్ కు యుద్ధం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్య
  • ఇలాంటి వ్యాఖ్యలతో భారత్ సహనం నశిస్తుందన్న మిథున్ చక్రవర్తి
సింధు జలాలను భారత్ నిలిపివేయడంపై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. భారత్ పై అణుదాడి చేస్తామని కూడా బెదిరింపులకు దిగుతోంది. యుద్ధం గురించి ఆలోచించడం మినహా పాకిస్థాన్ కు మరోదారి లేదని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో తీవ్ర వ్యఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, బీజేపీ నేత, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

పాకిస్థాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పోతే... భారత్ సహనం నశిస్తుందని మిథున్ చక్రవర్తి అన్నారు. అప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు ఒకదాని వెంట మరొకటి పాకిస్థాన్ పైకి దూసుకెళతాయని హెచ్చరించారు.

తాజాగా ఓ కార్యక్రమంలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ... భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో తమ దేశానికి పెద్ద నష్టం జరిగిందని అన్నారు. మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్థాన్ కు చాలా నష్టం కలిగించాయని చెప్పారు. పాక్ ప్రజలంతా ఐక్యంగా ఉంటూ... ఇండియా దురాక్రమణకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే మనకు యుద్ధం తప్ప మరో మార్గం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలకు మిథున్ చక్రవర్తి కౌంటర్ ఇచ్చారు.
Mithun Chakraborty
Pakistan
BrahMos missile
Bilawal Bhutto
India
Sindhu waters
Nuclear attack threat
BJP
Bollywood actor
War threat

More Telugu News