నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం హైకమాండ్ కు తెలియదా?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం
- తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరని మండిపాటు
- తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్
తనకు మంత్రి పదవి రాకపోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం పార్టీ హైకమాండ్ కు తెలియదా? అని అసహనం వ్యక్తం చేశారు. అన్నదమ్ములం ఇద్దరమూ సమర్థులం అయినప్పుడు... ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. కొంత ఆలస్యమైనా ఓపికపడతానని, కానీ, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారని... ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా పరిస్థితి ఉందని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు... 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా చేసిన తాను మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడినని చెప్పారు.