Viral Video: జ‌మ్మూక‌శ్మీర్‌లో 1508 మీట‌ర్ల భారీ త్రివ‌ర్ణ ప‌తాకంతో ర్యాలీ.. ఇదిగో వీడియో

Doda district of Jammu Kashmir students rally with 1508 meter Indian flag
  • జ‌మ్మూక‌శ్మీర్‌లోని దోడా జిల్లాలో తిరంగా ర్యాలీ
  • 1508 మీట‌ర్ల పొడవైన జాతీయ ప‌తాకాన్ని ప్ర‌ద‌ర్శించిన విద్యార్థులు
  • వెల్క‌మ్ దోడా ఎంట్రీ గేటు నుంచి క‌మ్యూనిటీ హాల్ వ‌ర‌కు ర్యాలీ
  • తిరంగా ర్యాలీ వీడియో నెట్టింట వైర‌ల్
జ‌మ్మూక‌శ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమ‌వారం విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో సుమారు 1508 మీట‌ర్ల పొడవైన జాతీయ ప‌తాకాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. దోడా జిల్లా డిప్యూటీ క‌మీష‌న‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్ నేతృత్వంలో ఈ మెగా తిరంగా ర్యాలీ జ‌రిగింది. వెల్క‌మ్ దోడా ఎంట్రీ గేటు నుంచి క‌మ్యూనిటీ హాల్ వ‌ర‌కు భారీ త్రివ‌ర్ణ ప‌తాకంతో ఈ తిరంగా ర్యాలీని నిర్వహించారు.   

ఈ సందర్భంగా విద్యార్థులు త‌మ దేశ‌భ‌క్తిని చాటుకుంటూ దేశ‌భ‌క్తి గీతాలను ఆలపిస్తూ, నినాదాలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. ఈ తిరంగా ర్యాలీ తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 
Viral Video
Doda district
Jammu Kashmir
Tiranga rally
Indian flag
Harvinder Singh
National flag rally
Doda
Independence Day
Tricolor flag

More Telugu News