Balochistan Liberation Army: బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్ ను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన అమెరికా

Balochistan Liberation Army Designated as Terrorist Group by US
  • బీఎల్ఏను ఉగ్రసంస్థగా గతంలోనే గుర్తించిన అమెరికా
  • ఇప్పుడు దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్ ను కూడా ఉగ్రసంస్థగా ప్రకటించిన యూఎస్
  • ఉగ్రవాద గుర్తింపు ఇవ్వడం వల్ల వాటికి మద్దతు తగ్గుతుందన్న అమెరికా
పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛను కోరుతూ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. స్వతంత్ర బలూచిస్థాన్ లక్ష్యంగా పాక్ ఆర్మీపై తీవ్ర దాడులకు కూడా తెగబడుతోంది. మరోవైపు బీఎల్ఏకు అమెరికా షాక్ ఇచ్చింది. బీఎల్ఏను, దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. బీఎల్ఏకు గతంలోనే ఇచ్చిన స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ క్లాసిఫికేషన్ లో మజీద్ బ్రిగేడ్ ను కూడా చేర్చింది. 

ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.... 2019 నుంచి జరిగిన ఎన్నో దాడులకు బీఎల్ఏ బాధ్యత వహించిందని చెప్పారు. వీటిలో మజీద్ బ్రిగేడ్ చేసిన దాడులు కూడా ఎన్నో ఉన్నాయని తెలిపారు. 

బీఎల్ఏను 2019లో స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా గుర్తించింది. మరోవైపు 2024లో కరాచీ ఎయిర్ పోర్టు, గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ లో జరిగిన ఆత్మాహుతి దాడులు, 2025లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేయడం వంటివి తామే చేసినట్టు బీఎల్ఏ ప్రకటించుకుంది.

ఈ దాడులపై అమెరికా స్పందిస్తూ... ఇలాంటి దాడులు ప్రజా సంక్షేమానికి, ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా పరిణమించాయని తెలిపింది. ఇలాంటి సంస్థలకు ఉగ్రవాద గుర్తింపు ఇవ్వడం వల్ల టెర్రరిస్టుల కార్యకలాపాలకు మద్దతు తగ్గే అవకాశం ఉందని అమెరికా పేర్కొంది.
Balochistan Liberation Army
BLA
Balochistan
Pakistan
United States
терроризм
Majid Brigade
Karachi Airport Attack
Gwadar Port
Marco Rubio

More Telugu News