Asim Munir: అసీం మునీర్‌ను లాడెన్‌తో పోలుస్తూ పెంటగాన్ మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు

Asim Munir Compared to Laden by Ex Pentagon Official
  • అసీం మునీర్ వ్యాఖ్యలు సమర్ధనీయం కాదన్న పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్
  • అసీం మునీర్ కు, లాడెన్ కు పెద్ద తేడా లేదన్న రూబిన్
  • అసీం మునీర్‌ను అమెరికా నుంచి బహిష్కరించి ఉండాల్సిందన్న రూబిన్
పాక్ సైన్యాధికారి అసీం మునీర్‌ను కరుడుగట్టిన ఉగ్రవాది, ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌తో పోలుస్తూ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉండగానే అసీం మునీర్ అణు బెదిరింపులకు పాల్పడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాడెన్‌కు, అసీం మునీర్‌కు పెద్ద తేడా లేదని మైఖేల్ రూబిన్ వ్యాఖ్యానించారు.

అసీం మునీర్ వ్యాఖ్యలపై ఓ వార్తా సంస్థతో రూబిన్ మాట్లాడుతూ.. అమెరికా గడ్డపై ఉండి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదని అన్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఒక దేశంగా పాక్ దాని బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతుందా? అనే ప్రశ్నలు అనేక మందిలో తలెత్తుతున్నాయన్నారు.

వాస్తవానికి అసీం మునీర్ వ్యాఖ్యలను ట్రంప్ పరిపాలనాధికారులు వెంటనే ఖండించడంతో పాటు దేశం నుంచి బహిష్కరించి ఉండాల్సిందన్నారు. ఈ క్రమంలో పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరిస్తున్న నేపథ్యంలో చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును పాక్ కోల్పోయిందని ఆయన అన్నారు. 
Asim Munir
Pakistan
Osama bin Laden
Michael Rubin
Pentagon
Nuclear threats
Pakistan Army
US relations
Terrorism
Al Qaeda

More Telugu News