Hyderabad Floods: డ్రైనేజీలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్.. వీడియో ఇదిగో!
- భారీ వర్షంలో ఫుడ్ డెలివరీకి వెళ్లిన యువకుడు
- వరద నీటిలో వెళుతూ అదుపుతప్పి పడిపోయిన వైనం
- హైదరాబాద్లోని టీకేఆర్ కమాన్ వద్ద ఘటన
హైదరాబాద్ లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలకు నగర వీధులు నదీ ప్రవాహాలను తలపించేలా మారుతున్నాయి. శనివారం నాడు కురిసిన భారీ వర్షానికి వీధులు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో నగరంలోని టీకేఆర్ కమాన్ సమీపంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళుతున్న ఓ యువకుడు బైక్ అదుపుతప్పడంతో డ్రైనేజీలో పడిపోయాడు.
బైక్, ఫుడ్ డెలివరీ బ్యాగ్ కూడా నాలాలో పడిపోయాయి. వెంటనే స్పందించిన స్థానికులు డెలివరీ బాయ్ ని, అతడి బైక్ ను బయటకు తీశారు. అయితే, బ్యాగ్, మొబైల్ ఫోన్ మాత్రం దొరకలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.