Kandula Durgesh: ఏపీ ప్రభుత్వంతో కాసేపట్లో సినీ ప్రముఖుల భేటీ

AP Government meeting with Tollywood delegation on film issues
  • ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ తో సినీ ప్రముఖుల భేటీ
  • ఫిలిం ఫెడరేషన్ స్ట్రైక్, ఇతర సమస్యలలో చర్చించనున్న సినీ ప్రముఖులు
  • ఏపీ సచివాలయంలో జరగనున్న సమావేశం
ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తో టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఫిలిం ఫెడరేషన్ స్ట్రైక్, సినీ కార్మికుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భేటీ కోసం నాగవంశీ, బన్నీ వాసు సహా పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సచివాలయంకు చేరుకున్నారు. దిల్ రాజు, కేఎల్ నారాయణ, మైత్రి రవిబాబు, విశ్వప్రసాద్, నాగవంశీ, సాహు, చెర్రీ, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్, వైజయంతి ప్రొడక్షన్స్ స్వప్న, దానయ్య, బన్నీ వాసు, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు భేటీలో పాల్గొననున్నారు.
Kandula Durgesh
AP Government
Tollywood Film Chamber
Andhra Pradesh
Film Federation Strike
Telugu Film Industry
Dil Raju
Bunny Vasu
Cine Workers Issues
Film Industry Meeting

More Telugu News