Revanth Reddy: రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
- 2019 అక్టోబర్ లో సూర్యాపేట జిల్లాలో రేవంత్ పై కేసు నమోదు
- కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించిన హైకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2019 అక్టోబర్ లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పరిధిలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ రేవంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ పిటిషన్ పై ధర్మాసనం పలుమార్లు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.