Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ

Tirumala Sees Significant Drop in Devotee Rush
  • మూడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • 4 గంటల్లోగా శ్రీవారి దర్శనం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,628 మంది భక్తులు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ప్రతిరోజు ఎంతో రద్దీగా ఉంటుంది. ప్రతి రోజూ 50 వేల నుంచి లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుంటారు. దీంతో, స్వామివారి దర్శనానికి చాలా సమయం పడుతుంటుంది. అయితే, ప్రతిరోజు ఎంతో రద్దీగా ఉండే తిరుమలో నేడు భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వర్షాల కారణంగానే రద్దీ తగ్గినట్టు కనిపిస్తోంది. 

ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం మూడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం 4 గంటల్లోగా అయిపోతోంది. రూ. 300 ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. 

మరోవైపు నిన్న స్వామివారిని 82,628 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,505 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
Tirumala
Tirumala rush
Tirumala temple
Srivari darshan
TTD
Tirumala devotees
Andhra Pradesh temples
Rain effect

More Telugu News