పాక్ ఆర్మీ చీఫ్ నోట మళ్లీ అవే మాటలు.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బెదిరింపులు!
- అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్
- తమది అణ్వాయుధ దేశమని గుర్తు చేసిన వైనం
- సింధునదిపై భారత్ డ్యాములు నిర్మిస్తే క్షిపణులతో పేల్చేస్తామని ప్రేలాపనలు
- తాము నాశనం అవుతూనే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరిక
భారత్‌పై నిత్యం కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ఏమాత్రం వీడడం లేదు. ‘ఆపరేషన్ సిందూర్’తో చావు దెబ్బ తిన్నప్పటికీ నోటి దురుసును మాత్రం తగ్గడం లేదు. అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్‌పై మరోమారు నోరు పారేసుకున్నాడు. తమది అణ్వాయుధ దేశమని గుర్తు చేస్తూ, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని మునీర్ బహిరంగంగానే బెదిరించారు. తాము నాశనమైనా తమతోపాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పుకొచ్చారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సింధునది వివాదంపై మునీర్ మాట్లాడుతూ, ఆ నదిపై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు ఎదురు చూస్తామని చెప్పారు. తమ వద్ద క్షిపణులకు ఎలాంటి కొదవ లేదని, ఆ డ్యామ్‌లను పది క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు. భారత్ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఏర్పడితే, తాము నాశనం అవుతూనే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పుకొచ్చారు.