Chandrashekhar Siddi: కన్నడ టీవీ నటుడు చంద్రశేఖర్ సిద్ధి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Chandrashekhar Siddi Suicide Case Twist Revealed by Police
  • గత నెల 31న ఆత్మహత్య చేసుకున్న నటుడు 
  • ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలతో ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత గుర్తింపు
  • దర్యాప్తులో కీలక విషయం వెలుగులోకి
  • భార్య చీపురుతో కొట్టడంతో అవమానంతో ఆత్మహత్య
కన్నడ బుల్లితెర హాస్యనటుడు, ‘కామెడీ ఖిలాడీగాలు’ ఫేమ్ చంద్రశేఖర్ సిద్ధి (28) మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యల్లాపుర తాలూకా వజ్రళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిమనళ్లికి చెందిన సిద్ధి జులై 31న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యల్లాపుర తాలూకాలోని కట్టిగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్నాడు. కొన్ని నెలలుగా అతడు మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అప్పట్లో పోలీసులు తెలిపారు. 

2020లో కామెడి ఖిలాడీగాలు సీజన్ 3లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ షో తర్వాత పలు టీవీ సీరియళ్లలోనూ నటించాడు. అయితే, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆందోళనకు లోనయ్యాడని, ఇల్లు గడిచేందుకు ఇటీవల అతడు దినసరి కూలీగా కూడా మారాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 

ప్రతిష్ఠాత్మక నిసామ్ థియేటర్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన చంద్రశేఖర్ సిద్ధి నటనపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. గత మూడు నెలలుగా అతడు మానసిక ఆందోళనతో ఉన్నాడని, ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ భావించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్య అతడితో గొడవ పడి చీపురు, కట్టెతో కొట్టడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు యల్లాపుర రూరల్ పోలీసులు నిన్న వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు.
Chandrashekhar Siddi
Chandrashekhar Siddi suicide
Kannada actor suicide
Comedy Khiladigalu
Yallapur
Karnataka news
TV actor death
Financial problems
Nisam Theatre Institute
Suicide reason

More Telugu News