Trivikram Srinivas: ఎన్టీఆర్, హృతిక్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trivikram Srinivas Makes Interesting Comments About NTR and Hrithik
  • హైదరాబాద్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఎన్టీఆర్, హృతిక్‌లు వింద్య, హిమాలయ పర్వతాల్లాంటి వారన్న త్రివిక్రమ్
  • ఇది హృతిక్ రామారావు నామ సంవత్సరమన్న త్రివిక్రమ్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రూపొందిన 'వార్ – 2' మూవీ ఈ నెల 14న విడుదల కానున్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న త్రివిక్రమ్ తనదైన శైలిలో ప్రసంగించి అలరించారు.

ఎన్టీఆర్, హృతిక్‌లు వింధ్య, హిమాలయ పర్వతాల్లాంటి వారని, అలాంటి వారి సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని అన్నారు. 'దేవర' విడుదలైనప్పుడు ఆ ఏడాది దేవర నామ సంవత్సరం అని చెప్పానని, ఇప్పుడు దీనిని హృతిక్ రామారావు నామ సంవత్సరంగా పేర్కొంటున్నానన్నారు. మెరుపు తీగల్లా ఉన్న ఇద్దరినీ ఒకే తెరపై చూడటానికి రెండు కళ్లూ చాలవన్నారు.

ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదనీ, అంతకు మించి ఉంటుందని దర్శకుడు అయాన్ చెబుతున్నారన్నారు. సాధారణ యాక్షన్ మూవీ అయితే ఎన్టీఆర్ అవసరం లేదని, ఏ భావోద్వేగాన్నైనా పలికించగల నటుడు ఎన్టీఆర్ అని త్రివిక్రమ్ అన్నారు.

బంగారం ఉంటే నగ చేయించుకుంటారు కానీ బీరువాలో దాచిపెట్టుకోరని, అలాగే ఎన్టీఆర్ కూడా బంగారం లాంటి వారేనని, ఏ నగ చేయాలో ఆయాన్‌కు తెలుసునని, అందుకే ఎన్టీఆర్ కోసం ఇక్కడ దాకా వచ్చారన్నారు. 
Trivikram Srinivas
NTR
Jr NTR
Hrithik Roshan
War 2
Ayan Mukerji
Devara
Tollywood
Bollywood
Movie Pre Release Event

More Telugu News