Allu Arjun: అల్లు అర్జున్ ముఖం చూపించాకే చెకింగ్ క్లియరెన్స్ ఇచ్చిన ఎయిర్ పోర్టు సిబ్బంది!

Allu Arjun Face Reveal Required at Mumbai Airport Security
  • ముంబై విమానాశ్రయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆసక్తికర అనుభవం
  • మాస్క్, కళ్లజోడుతో ఉండటంతో గుర్తుపట్టలేకపోయిన భద్రతా సిబ్బంది
  • "ఆయన అల్లు అర్జున్" అని చెప్పిన అసిస్టెంట్ 
  • ముఖం చూపించాలన్న ఎయిర్ పోర్టు సిబ్బంది
  • ముఖం చూపించాకే లోపలికి అనుమతి
పాన్ ఇండియా స్టార్‌గా దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ముంబై విమానాశ్రయంలో ఓ ఆసక్తికర అనుభవం ఎదురైంది. అల్లు అర్జున్ నిన్న ముంబై విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ముఖానికి మాస్క్, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ ధరించి ఉండటంతో అక్కడి భద్రతా సిబ్బంది ఆయన్ను గుర్తుపట్టలేకపోయారు. సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్దకు రాగానే, నిబంధనల ప్రకారం ఆయన్ను ఆపారు. వెంటనే అల్లు అర్జున్ అసిస్టెంట్ కల్పించుకుని, "ఆయన సినీ హీరో అల్లు అర్జున్" అని సిబ్బందికి వివరించే ప్రయత్నం చేశారు.

అయితే, భద్రతా సిబ్బంది తమ విధి నిర్వహణకే కట్టుబడ్డారు. వ్యక్తి ఎవరైనా సరే, నిబంధనల ప్రకారం ముఖాన్ని చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ తన మాస్క్, కళ్లజోడు తొలగించి ముఖం చూపించారు. ఆయన ముఖం చూసిన తర్వాత గుర్తుపట్టిన సిబ్బంది, తనిఖీ ప్రక్రియను పూర్తి చేసి లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.
Allu Arjun
Mumbai Airport
Security Check
Icon Star
Pan India Star
Airport Security
Movie actor
Telugu cinema
Celebrity incident

More Telugu News