Khammam: ఖమ్మం శివారు కాలనీలో దొంగల కలకలం.. వీడియో ఇదిగో!

Khammam Colony Residents Fearful After Thief Sightings
––
ఖమ్మం జిల్లాలో దొంగల సంచారం కలకలం రేపుతోంది. నగర శివార్లలోని గొల్లగూడెంలో ముగ్గురు దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు కాలనీలో సంచరించారు. 

వీధిలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో కలియతిరుగుతూ డబ్బు, నగల కోసం వెతికారు. ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో దొంగల నిర్వాకం మొత్తం రికార్డైంది. రాత్రి కాలనీలో దొంగలు సంచరించిన విషయం ఉదయాన్నే గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సత్తుపల్లి పట్టణంలోని పీవీ నరసింహారావు సింగరేణి కాలరీస్‌లోనూ దొంగలు చోరీకి యత్నించారు.
Khammam
Khammam crime
Telangana crime
Gollagudem
Theft
Burglary
CCTV footage
Sattupalli
PV Narasimha Rao Singareni కాలరీస్
Singareni Collieries

More Telugu News