Roja: తిరుమలలో ఒకరికొకరు ఎదురుపడ్డ రోజా, సీపీఐ నారాయణ... వీడియో ఇదిగో!
- నేడు శ్రావణ పౌర్ణమి
- తిరుమలలో సందడి చేసిన వీఐపీలు
- కాసేపు మాట్లాడుకున్న రోజా, నారాయణ
- నెట్టింట సందడి చేస్తున్న వీడియో
ఇవాళ శ్రావణ పౌర్ణమి సందర్భంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రముఖులు సందడి చేశారు. వైసీపీ నేత రోజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరులు తిరుమల విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట ఆసక్తికర దృశ్యం కనిపించింది. రోజా, నారాయణ ఒకరికొకరు ఎదురుపడ్డారు. రోజాను చూసి నారాయణ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.