KCR: నేడు రాఖీ పౌర్ణమి... కేసీఆర్ కు రాఖీలు కట్టిన తోబుట్టువులు

KCR Celebrates Raksha Bandhan with Sisters
  • కేసీఆర్ ఇంట్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
  • మాజీ సీఎంకు రాఖీ కట్టిన ముగ్గురు సోదరీమణులు
  • పెద్ద అక్క కాళ్లకు మొక్కి ఆశీర్వచనం తీసుకున్న కేసీఆర్
  • అక్కాచెల్లెళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ
  • ముఖ్యమైన పనుల వల్ల ఢిల్లీలో కేటీఆర్.. వేడుకలకు దూరం
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పూర్ణిమ సందర్భంగా కేసీఆర్‌కు ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీ కట్టారు. కేసీఆర్ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతుడై ఉండాలని వారు ఆకాంక్షించారు. తమ సోదరుడికి మిఠాయిలు తినిపించారు. ఈ వేడుకల్లో కేసీఆర్ అర్ధాంగి శోభమ్మ తదితరులు కూడా పాల్గొన్నారు.

రాఖీ కట్టిన అనంతరం కేసీఆర్ తన అక్క లక్ష్మీబాయి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తన సోదరీమణులకు ఎప్పుడూ అండగా ఉంటానని కేసీఆర్ మాట ఇచ్చారు. 
KCR
KCR Rakhi
Raksha Bandhan
Telangana
BRS
KCR sisters
Rakhi Celebrations
K Chandrashekar Rao
Telangana News
Indian Festivals

More Telugu News