Parthasarathi: టీడీపీకి పట్టం కట్టేందుకు పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు: పార్థసారథి

Parthasarathi Confident of TDP Victory in Pulivendula ZPTC Elections
  • పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధిస్తుందన్న పార్థసారథి
  • గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పట్ల విజన్ కనిపించలేదని విమర్శ
  • పులివెందులలో చెరువులు కూడా నింపలేకపోయారని ఎద్దేవా
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని మంత్రి పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల ప్రజల నుంచి టీడీపీకి మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. వైసీపీ హయాంలో అంతులేని అవినీతి, అక్రమాలు జరిగాయని... దీంతో పులివెందుల ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పట్ల విజన్ కనిపించలేదని... బటన్ నొక్కాం, పని అయిపోయింది అనుకున్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు. రైతు భరోసా ఇచ్చామని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించలేదని విమర్శించారు. జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా చెరువులు నింపలేకపోయారని ఎద్దేవా చేశారు. పులివెందులలో గృహ నిర్మాణం కూడా దారుణంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెప్పారు.
Parthasarathi
Pulivendula
TDP
Andhra Pradesh
AP Politics
YSRCP
Jagan Mohan Reddy
Rayalaseema
ZPTC Elections

More Telugu News