రష్యా, ఉక్రెయిన్ మధ్య భూభాగాల మార్పిడి ఉంటుంది: ట్రంప్

  • రష్యా-పుతిన్ మధ్య యుద్ధం ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు
  • పుతిన్ తో భేటీకి సిద్ధమవుతున్న ట్రంప్
  • రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందనే ఆశాభావంలో ట్రంప్
మూడున్నరేళ్లు గడిచినా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడలేదు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. 

తాజాగా ట్రంప్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో భూభాగాల మార్పిడి కూడా ఉంటుందని చెప్పారు. తన 'ట్రూత్ సోషల్' ఖాతా ద్వారా ట్రంప్ స్పందిస్తూ... రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందంలో భాగంగా కొన్ని భూభాగాలు వెనక్కి తీసుకోవడం, కొన్ని భూభాగాలు మార్చుకోవడం జరుగుతుందని చెప్పారు. అయితే, ఏయే భూభాగాలు అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

వాస్తవానికి ఈనెల 15న అలస్కా వేదికగా పుతిన్ తో భేటీ కానున్నట్టు ట్రంప్ తొలుత ప్రకటించారు. అయితే, దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, తొలుత పుతిన్ తో ద్వైపాక్షిక భేటీ జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం.


More Telugu News