Avinash Reddy: రాష్ట్ర ఎన్నికల సంఘంపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

YS Avinash Reddy Accuses EC of Conspiracy in Pulivendula
  • వేడి పుట్టిస్తున్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక
  • బూత్ ల మార్పుతో ఎన్నికల సంఘం కుట్రకు తెరలేపిందన్న అవినాశ్ రెడ్డి
  • దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని మండిపాటు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో వేడిపుట్టిస్తోంది. ఎన్నికలో గెలుపును ఇటు అధికార పక్షం, అటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శివకళ్యాణ్ రెడ్డి బరిలో ఉన్నారు. 

మరోవైపు, రాష్ట్ర ఎన్నికల సంఘంపై వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ కు ముందు బూత్ ల మార్పుతో ఎన్నికల సంఘం కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల మార్పు వెనుక టీడీపీ కుట్ర ఉందని మండిపడ్డారు. ఏ ఊరి వాళ్లు ఆ ఊళ్లోనే ఓటు వేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ము ప్రభుత్వానికి, ఈసీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
Avinash Reddy
Pulivendula
ZPTC Election
Andhra Pradesh Politics
YS Avinash Reddy Allegations
Election Commission
TDP
BTech Ravi
YSRCP
AP Elections

More Telugu News