YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు

YS Avinash Reddy and Bhaskar Reddy Served Notices
  • టీడీపీలో చేరిన పులివెందుల వైసీపీ నేత విశ్వనాథరెడ్డి
  • విశ్వనాథరెడ్డిని బెదిరించిన అవినాశ్ రెడ్డి తదితరులు
  • నిందితులకు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన పులివెందుల పోలీసులు
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు, పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 

అయితే పార్టీ మారినందుకు అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాశ్ పీఏ రాఘవరెడ్డిలతో పాటు తమ గ్రామానికి చెందిన గంగాధర్ రెడ్డిలు తనను తీవ్రంగా బెదిరించారని విశ్వనాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులకు అందజేశారు. 

విశ్వనాథరెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. 41ఏ కింద నిందితులకు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డి బెయిల్ షరతుల మేరకు హైదరాబాద్ లో ఉన్నారు. దీంతో, పులివెందుల పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి వారికి నోటీసులు అందించారు. మూడురోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మిగిలిన నిందితులకు పులివెందులలోనే నోటీసులు అందించారు.
YS Avinash Reddy
Avinash Reddy
YS Bhaskar Reddy
Bhaskar Reddy
Pulivendula
Kadapa
TDP
Vishwanath Reddy
YSRCP
Andhra Pradesh Politics

More Telugu News