దక్షిణ తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

––
రాబోయే నాలుగు రోజుల పాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వనపర్తి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూలు, గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కాగా, హైదరాబాద్‌ లో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.


More Telugu News