Shama Parveen: బెంగళూరులో అల్‌ఖైదా సానుభూతిపరురాలి అరెస్టు.. విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు!

Shama Parveen Requested Pakistan Army Chief to Bomb Bengaluru
    
బెంగళూరులో ఇటీవల అరెస్టయిన అల్‌ఖైదా మద్దతురాలు శమా పర్వీన్ (30) విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అధికారులు ఆమెను విచారించారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన విషయాలు అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో బెంగళూరును పేల్చేయాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌ను ఆమె కోరినట్టు వెల్లడైంది. 

సోషల్ మీడియాలో అసీమ్ మునీర్ చిత్రాన్ని పోస్టు చేసిన పర్వీన్ భారతదేశంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలను ఏకీకరణ చేయాలని కోరింది. ఆమె సోషల్ మీడియా ఖాతాకు దాదాపు పదివేల మంది ఫాలోవర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఆమె తన సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది.  ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. 
Shama Parveen
Al-Qaeda
Bengaluru
NIA
ATS
Aseem Munir
Pakistan Army
Operation Sindoor
Social Media
Terrorism

More Telugu News