విడాకులు తీసుకోబోతోందనే వార్తలపై సినీ నటి సంగీత స్పందన

  • గాయకుడు క్రిష్ ను పెళ్లాడిన సంగీత
  • ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • ఆ వార్తల్లో నిజం లేదన్న సంగీత
ప్రముఖ సినీ నటి సంగీత, ఆమె భర్త, గాయకుడు క్రిష్ విడాకులు తీసుకోబోతున్నరంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై సంగీత స్పందించారు. తాము విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపారు. అంతేకాదు తన భర్తతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

ఇన్స్టాగ్రామ్ బయోలో గతంలో సంగీత పేరు సంగీత క్రిష్ గా ఉండేది. అయితే, ఆమె ఆ పేరును మార్చడంతో... ఇద్దరూ విడిపోతున్నారనే ప్రచారం మొదలయింది. దీంతో, ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తామిద్దరం బాగానే ఉన్నామని తెలిపారు.


More Telugu News