Ketireddy Venkatrami Reddy: ఇక్కడ పోటీ చేస్తున్నది బీటెక్ రవి భార్య కాదు.. పరోక్షంగా చంద్రబాబే పోటీ చేస్తున్నారు: కేతిరెడ్డి

Ketireddy Says Chandrababu Indirectly Competing in Pulivendula ZPTC Election
  • రణరంగంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక
  • టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య లతారెడ్డి
  • పులివెందుల వైసీపీ కుటుంబానికి అడ్డా అన్న కేతిరెడ్డి
జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పులివెందుల రణరంగంగా మారింది. ఎన్నిక జరుగుతున్న ఒకే ఒక్క జడ్పీటీసీ స్థానంలో 11 మంది పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి బరిలోకి దిగారు. 

పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట కావడంతో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రచార రంగంలోకి దిగారు. వైసీపీ గెలుపు కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ క్రమంలో ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈరోజు పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... జడ్పీటీసీ ఎన్నికను తాము అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. పులివెందుల వైఎస్ కుటుంబానికి అడ్డా అని... ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టేందుకే తాను ఇక్కడకు ప్రచారం కోసం వచ్చానని చెప్పారు. 

ఇక్కడ పోటీ చేస్తున్నది బీటెక్ రవి భార్య లతారెడ్డి కాదని... పరోక్షంగా సీఎం చంద్రబాబే పోటీ చేస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో అనేక స్థానాల్లో తమ పార్టీ గెలుపొందిందని గుర్తు చేశారు. పులివెందులను ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
Ketireddy Venkatrami Reddy
Pulivendula
ZPTC Elections
B Tech Ravi
Chandrababu Naidu
Andhra Pradesh Politics
YSRCP
TDP
Marella Latha Reddy
local body elections

More Telugu News